News November 5, 2025

BE READY.. నగరంలో బిగ్గెస్ట్ పెట్ షో

image

ఈనెల 22,23 తేదీల్లో సిటీలో అతి పెద్ద పెట్ షో జరుగనుంది. నార్సింగిలోని ఓమ్ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. దాపు 500 విభిన్న జాతులకు చెందిన కుక్కలు ప్రదర్శనకు రానున్నాయి. అంతేకాక వందకుపైగా పిల్లుల జాతులు, అరుదైన చేపలు అలరించనున్నాయి. ఇంకో విషయమేమంటే.. ఈ ఎగ్జిబిషన్‌లో పెట్స్ యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Similar News

News March 21, 2026

Wah.. నగరమంతా నోరూరించే సువాసన

image

రంజాన్ అనగానే షీర్ ఖుర్మా గుర్తొస్తుంది. నగరమంతా దీని గుమగుమలతో నిండిపోతుంది. గల్లీల్లో దోస్తులందరినీ ఇంటికి పిలిచి దావత్‌ ఇచ్చి ఆఖరున షీర్ ఖుర్మాతో నోరు తీపి చేస్తారు. ఈ షీర్ ఖుర్మాకు ప్రత్యేకత ఉంది. పాలను బాగా మరిగించి ఖర్జూరాల తీపితో చేసే ఈ డెజర్ట్ తక్షణ శక్తినిస్తుంది. దీంట్లోని కాల్షయం, ప్రోటీన్లు ఎముకలను బలపరిచి, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణుల మాట.

News March 21, 2026

HYDలో దారుణం.. లవర్‌పై కత్తితో దాడి

image

మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అలీషా అలియాస్ పాండు తన తండ్రి లాలూతో కలిసి యువతిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు నూకరత్నం (25)ను స్థానికులు వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2026

HYD: MMTS 2వ దశకు రూ.50కోట్లు

image

MMTS 2వ దశ కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. రెండో దశలో నగర శివారు ప్రాంతాలను కలుపుతూ ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టారు. అప్పట్లో రూ.850 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. ప్రాజెక్టు జాప్యంతో ఇది రూ.1.150 కోట్లు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం 1/3, రైల్వేశాఖ 1/4 చొప్పున నిధులు అందజేయాలి. ఈ మేరకు ఏటా బడ్జెట్‌లో MMTS కోసం కేటాయిస్తున్నారు.