News November 5, 2025
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అస్వస్థత

అమలాపురం: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైసీపీ అమలాపురం ఇన్‌ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆసుపత్రికి వచ్చారు. పలువురు వైసీపీ శ్రేణులు ఆసుపత్రి చేరుకుంటున్నాయి.
Similar News
News March 5, 2026
WGL: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక!

జిల్లాలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’కు రంగం సిద్ధమైంది. జూన్ 15 వరకు సాగే ఈ కార్యక్రమంలో తొలిదశ పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఏప్రిల్‌లో ఆరోగ్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, బాలల భద్రతపై ప్రత్యేక డ్రైవ్‌లు, మేలో రైతు సమస్యలు, విద్య, క్రీడలు, మహిళా సాధికారతపై దృష్టి సారించనుండగా, జూన్‌లో పర్యావరణ పరిరక్షణతో ఈ ప్రణాళిక ముగియనుంది.
News March 5, 2026
విశాఖలో నడిరోడ్డుపై మృతదేహం

విశాఖలో నడిరోడ్డుపై వ్యక్తి విగతజీవిగా పడిఉన్నాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. గంటల తరబడి మృతదేహం అలాగే ఉన్నా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోలేదు. ఇసుకతోట జంక్షన్ వెంకజిపాలెం వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గంటల తరబడి మృతదేహం అలానే ఉంది.
News March 5, 2026
నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి

నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున ఓ గుర్తుతెలియని వృద్ధుడు (65-70 ఏళ్లు) గుండెపోటుతో మృతి చెందాడు. బుకింగ్ కౌంటర్ వద్ద కూర్చుని ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.


