News November 5, 2025
యూట్యూబ్‌లో నెలకు 6లక్షలు సంపాదిస్తున్న బామ్మ

నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన సుమన్ ధమానే. 70ఏళ్లవయసులో ఆప్లీ ఆజీ అనే యూట్యూబ్ ఛానెల్‌ను మొదలు పెట్టిన ఆమెకు ప్రస్తుతం 17.9 లక్షల సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఆ ఛానెల్‌లో ప్రధానంగా సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలే ఉంటాయి. ఆమె మనవడు యష్ సాయంతో ఆమె ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టి నెలకు 5-6 లక్షల వరకు సంపాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Similar News
News March 20, 2026
SRH జట్టుకు మరో షాక్!

IPL: మొదటి కొన్ని మ్యాచ్‌లకు ఇప్పటికే కెప్టెన్ కమిన్స్ దూరం కాగా SRH జట్టుకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా లీగ్ నుంచి వైదొలిగినట్లు Cricbuzz తెలిపింది. అయితే గాయానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఇటీవల వేలంలో AUSకు చెందిన ఈ ప్లేయర్‌ను SRH రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇద్దరు పేసర్లు లేకపోవడం SRH బౌలింగ్ విభాగానికి తలనొప్పిగా మారింది.
News March 20, 2026
ఇక్కడి LPG మన అవసరాలకే: హైకోర్టు

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఉత్పత్తి చేసే LPGని దేశీయ అవసరాలకు మాత్రమే వినియోగించాలని AP హైకోర్టు ఆదేశించింది. లేదంటే సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాన్ఫిడెన్స్ పెట్రోలియం LPGని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
News March 20, 2026
అకాల వర్షాలు.. పంట నష్టంపై రైతుకు భరోసా!

AP: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టాల వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీసత్యసాయి, NTR, అనంతపురం, మన్యం జిల్లాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు CM దృష్టికి తెచ్చారు. వాతావరణ పరిస్థితులపై రైతులను అప్రమత్తం చేయాలని CBN సూచించారు. మరోవైపు పంట నష్టపోయిన ప్రతి రైతుకూ సాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్న భరోసా ఇచ్చారు.


