News November 5, 2025
సిరిసిల్ల కవి ‘జిగిరి’ నవలకు దేశవ్యాప్త గుర్తింపు

సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించిన ‘జిగిరి’ నవల దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. ఈ నవలను ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ, ఒడియా, పంజాబీ, సింధీ, మలయాళం తదితర 10 భాషల్లోకి అనువదించారు. ఒడియా, పంజాబీ భాషల్లో 2 సార్లు అనువాదమవ్వడంతో మొత్తం 12 అనువాదాల ఘనతను ఈ నవల సాధించింది. కాగా, తెలుగు సాహిత్యంలో ఒకే నవల ఇన్ని భాషల్లోకి అనువాదం అవ్వడం చాలా అరుదు.
Similar News
News March 21, 2026
పుట్టపర్తి: పోలీసుల పటిష్ఠ బందోబస్తు

శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో పవిత్ర రంజాన్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ప్రార్థన మందిరాలు, మసీదులు వద్ద సిబ్బందిని నియమించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత సాఫీగా అందరూ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
News March 21, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

పవన్-హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.59 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు Sacnilk తెలిపింది. ఇండియాలో రూ.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.7 కోట్లు సాధించినట్లు వివరించింది. మొత్తంగా రూ.44 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. గురువారంతో పోల్చితే శుక్రవారం థియేటర్లలో షోలతో పాటు సీట్ల ఆక్యుపెన్సీ తగ్గిందని పేర్కొంది. మరి మీరు మూవీ చూశారా? ఎలా ఉంది?
News March 21, 2026
బీటీపీఎస్‌లో సాంకేతిక లోపం.. విద్యుదుత్పత్తికి విఘాతం

బీటీపీఎస్లో శనివారం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. ప్లాంట్‌లోని రెండో యూనిట్ బాయిలర్‌లో లీకేజీ సంభవించడంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సమాచారం అందుకున్న జెన్‌కో అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు. బాయిలర్ లీకేజీ సమస్యను రెండు రోజుల్లోగా పరిష్కరించి, తిరిగి ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని బీటీపీఎస్ సీఈ బిచ్చన వెల్లడించారు. విద్యు


