News November 5, 2025
తిరుమలలో మహిళ మృతి.. ఈమె మీకు తెలుసా?

తిరుమల మెయిన్ కళ్యాణకట్ట ఎదురుగా ఓపెన్ షెడ్‌లో ఓ మహిళకు ఫిట్స్ వచ్చాయి. వెంటనే అశ్విని ఆసుపత్రికి అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఆమె పేరు ఏ.మంగ(40) అని మాత్రమే తెలిసింది. ఎవరైనా ఈ మహిళను గుర్తిస్తే తిరుమల వన్ టౌన్ పోలీసులను 9440796768, 9440796771, 0877-2289027 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.
Similar News
News March 21, 2026
శాంతి, సామరస్యాలకు ప్రతీక రంజాన్: కలెక్టర్ రిజ్వాన్

రంజాన్ పండుగ శాంతి, సామరస్యాలకు నిదర్శనమని, ఇది అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించడానికి దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం గద్వాల ఈద్గా వద్ద జరిగిన ఈద్ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. రంజాన్ పరస్పర గౌరవాన్ని, సేవాభావాన్ని, దాన గుణాన్ని పెంపొందించే పవిత్ర మాసమని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలు సఖ్యతతో జీవించాలని, సమాజంలో ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు.
News March 21, 2026
బాంబుల మోత మధ్య పండుగ!

దూసుకొచ్చే మిస్సైళ్లు.. ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలియని బాంబులు. ఇలాంటి భయానక వాతావరణంలో ఇరాన్ సహా గల్ఫ్ దేశాలు రంజాన్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా విరుచుకుపడుతుండగా ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. దీంతో ముస్లింలు ఆనందంగా జరుపుకునే పండుగ భయం గుప్పిట్లో జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
News March 21, 2026
హనుమకొండ జిల్లాలో పెరిగిన అటవీ విస్తీర్ణం

జిల్లాలో అటవీ విస్తీర్ణం పరిమితంగా ఉంది. సుమారు 4 వేల ఎకరాలు ఉండగా 0.20 శాతం విస్తీర్ణం పెరిగినట్లు అంచనా. జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని ఇనుపరాతి గుట్టల పరిధిలో అడవులు విస్తరించాయి. ముఖ్యంగా దేవనూరు అటవీ ప్రాంతంలో ఈ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, కుందేళ్లు తదితర వన్యప్రాణులు సంచరిస్తున్నాయి.
# నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.


