News November 5, 2025

8 కిలోమీటర్లు కాలినడకన గుట్టకు చేరిన కలెక్టర్

image

కొత్తగూడెం:జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ 8 కి.మీ.లు నడిచి చండ్రుగొండ మండలం కనకగిరి (కనకాద్రి) గుట్టపై ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించారు. కాకతీయుల కాలం నాటి కట్టడాల సంరక్షణ బాధ్యత మనదేనన్నారు. గుట్టపై సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వెదురు ఉత్పత్తుల తయారీదారులైన గిరిజనులను ఆయన అభినందించారు.

Similar News

News March 21, 2026

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

News March 21, 2026

ఇకపై ఖర్చులు పెరుగుతాయనేది నిజం: రాహుల్ గాంధీ

image

రూపాయి విలువలో క్షీణత, ఇండస్ట్రియల్ డీజిల్ ధరల హైక్ దేశంలో ద్రవ్యోల్బణానికి సంకేతాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇది మామూలేనని కేంద్రం తోసిపుచ్చినా రవాణా ఖర్చులు పెరగడం, MSMEలపై భారం, నిత్యావసర సరకుల ధరల పెంపు, FII సెల్లింగ్‌తో స్టాక్ మార్కెట్లపై భారం పడనుందనేది నిజమన్నారు. ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని, దీనిని ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్‌కు ప్లాన్ లేదని విమర్శించారు.

News March 21, 2026

HYD: పాత బ్యాచ్ విద్యార్థులకు మరోసారి అడ్మిషన్

image

HYD డా.బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1986 నుంచి 2013 వరకు డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ) పూర్తి చేయలేకపోయిన పాత బ్యాచ్ విద్యార్థులకు మరోసారి అడ్మిషన్ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మధ్యలో చదువు ఆపేసిన వారికి ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది. నిర్దిష్ట నిబంధనలతో తిరిగి నమోదు చేసుకుని మిగిలిన సబ్జెక్టులు పూర్తి చేసుకునే వీలు ఉంటుంది.