News November 5, 2025

MNCL: ఈ నెల 9న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు

image

కాసిపేట మండలం సోమగుడెం సింగరేణి మైదానంలో ఈ నెల 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో 9న ఉదయం 9గంటలకు హాజరుకావాలని జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్ సూచించారు.

Similar News

News April 2, 2026

ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణోత్సవంలో CM దంపతులు

image

ఆంధ్రా భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు 6వసారి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. సీఎం దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పండు వెన్నెల్లో సుమారు 55వేల మందికిపైగా భక్తులు కళ్యాణాన్ని తిలకించారు.

News April 2, 2026

కామారెడ్డి: ఇసుక దరఖాస్తులపై అధికారులకు శిక్షణ: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు, స్థానిక అవసరాల కోసం ‘మన ఇసుక-మన వాహనం’ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలని, దీని వల్ల సరఫరాలో పారదర్శకత పెరుగుతుందని ఆయన తెలిపారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ విక్టర్ ఉన్నారు.

News April 2, 2026

జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 7న జాబ్ మేళా

image

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 7న టీఎస్‌కేసీ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమేశ్ తెలిపారు. 18 ఏళ్లు పైబడిన యువత, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. SSC నుంచి పీజీ వరకు అర్హత కలిగిన వారికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించనునట్లు వివరించారు.