News November 5, 2025

సంగారెడ్డి: 11న కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 11న కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహారదీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభు గౌడ్ తెలిపారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో జేఏసీ సమావేశం మంగళవారం నిర్వహించారు. జాతీయ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 21, 2026

IPLలో గ్రేటెస్ట్ టీమ్ ఇదే: పఠాన్

image

IPLలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ టీమ్ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ముంబై, చెన్నైలలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే కష్టమే. చెన్నై 2010లో, ముంబై 2013లో తొలిసారి టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. కానీ టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్లను అందించడంలో ముంబై ముందు వరుసలో ఉంది. అందులో నలుగురు టీమ్ ఇండియా కెప్టెన్లు ఉన్నారు. అందుకే ముంబై అంటే నాకు గౌరవం’ అని తెలిపారు.

News March 21, 2026

అనంతపురంలో బీజేపీ ‘SIR’ జిల్లా సన్నాహక సమావేశం

image

అనంతపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం SIRపై సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాజేశ్ కురుబ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా రాష్ట్ర మీడియా ప్రతినిధి మధుసూదన్, కార్యదర్శి శ్రీనివాసులు, చిరంజీవి రెడ్డి హజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీదేవి పాల్గొన్నారు.

News March 21, 2026

రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి: మెదక్ కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన రైతు ఉత్సవాల’ కార్యక్రమంలో మెదక్ జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం నర్మెటలో జరిగే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీ శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుంచి 2,650 మంది రైతులను తరలించేందుకు 53 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.