News November 5, 2025
తాడిపత్రిలో బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య

తాడిపత్రిలో ఓ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణంలోని పెద్ద బజార్‌లో యూనియన్ బ్యాంక్ మేనేజర్ గుగారా(41) నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లోనే ఉరివేసుకొని తనువు చాలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 12, 2026
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

నంద్యాలా జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 130 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. వీటిలో 84 ప్రభుత్వ, 46 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 25,035 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News March 12, 2026
భారత్‌పై మళ్లీ టారిఫ్స్.. రెడీ అవుతున్న ట్రంప్?

అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తున్నాయనే ఆరోపణలతో భారత్, చైనా సహా 16 దేశాలపై దర్యాప్తునకు ట్రంప్ ఆదేశించారు. గతంలో వివిధ దేశాలపై విధించిన అదనపు టారిఫ్‌లను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ విచారణ ఆయా దేశాలు అమెరికా విషయంలో అన్యాయమైన ట్రేడ్ ప్రాక్టీసెస్‌ను అమలు చేస్తున్నాయని నిర్ధారిస్తే మళ్లీ టారిఫ్స్ వేయడం లేదా ఇతర ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
News March 12, 2026
ఆదోని మార్కెట్‌లో పతనమైన ధరలు

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వివిధ పంటల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి గరిష్ఠంగా రూ.8,239, వేరుశనగ రూ.8,487, ఆముదాలు రూ.6,062 పలికాయి. శనగలు రూ.4,919, కందులు రూ.7,272 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కేంద్రాలు మూతపడటంతో పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. వారం రోజులుగా వేరుశనగ ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


