News November 5, 2025

యాలాల్: ‘అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది’

image

రోడ్డు ప్రమాదంలో మరణించిన యాలాల్ మండలానికి చెందిన పలు కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. పేర్కంపల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ, నందిని, తనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల చొప్పున ముగ్గురికి మొత్తం రూ.21 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన గుర్రాల అఖిల రెడ్డి కుటుంబానికి రూ.7లక్షల చెక్కును అందజేశారు.

Similar News

News November 5, 2025

‘మీ డబ్బు- మీ హక్కు’ గోడ పత్రిక ఆవిష్కరణ

image

పది ఏళ్లు అంతకు మించి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్మును బ్యాంకులు తిరిగి ఇచ్చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మీ డబ్బు- మీ హక్కు నినాదంతో భారత ప్రభుత్వం మూడు నెలల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంపై రూపొందించిన గోడ పత్రికను బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో ఆయన ఆవిష్కరించారు. కాకినాడ జిల్లాలో 5,88,521 బ్యాంకు ఖాతాల్లో రూ.101.22 కోట్లు సొమ్మును తిరిగి పొందవచ్చన్నారు.

News November 5, 2025

పెడన: సైబర్ క్రైమ్ కేసు.. విశాఖపట్నంకు ఆరుగురి తరలింపు

image

విశాఖపట్నం సైబర్ క్రైమ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన ఆరుగురిని అధికారులు పెడనలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం విశాఖపట్నానికి తరలించారు. నిందితులపై పెడన పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ అరెస్టులు, దర్యాప్తుతో పెడన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

News November 5, 2025

కార్తీక పౌర్ణమి.. వెలుగు జిలుగుల్లో కాశీ

image

దేశంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. కాశీ పుణ్యక్షేత్రం దీపాల వెలుగుల్లో మెరిసిపోయింది. గంగా నది ఒడ్డున కాశీ ఘాట్‌ను వేలాది విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.