News November 5, 2025

సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడలు ఈ నెల 11 నుంచి ప్రారంభం

image

మొంథా తుఫాను కారణంగా వాయిదా పడిన ఆల్‌ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీలు ఈ నెల 11, 12, 13వ తేదీల్లో జరుగనున్నాయి. ఈ మేరకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. కలెక్టర్‌ అనుమతితో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తామని చెప్పారు. నంద్యాలలో 11, 12న వివిధ క్రీడలు, కర్నూలులో 13న స్విమ్మింగ్‌ పోటీ ఉంటుందని తెలిపారు.

Similar News

News November 5, 2025

కొడంగల్: రవాణా పేరుతో అధికంగా వసూలు..!

image

గ్యాస్ సిలిండర్ రవాణా పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని గ్యాస్ ఏజెన్సీల నుంచి సిలిండర్లు సరఫరా చేస్తున్న సిబ్బంది రవాణా ఛార్జీల పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. గ్యాస్ ధర రూ.905 ఉంటే రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

News November 5, 2025

పిల్లల ముందు ఆ పనులు వద్దు!

image

పేరెంట్స్ ఏది చేస్తే చిన్న పిల్లలు వాటినే అనుకరిస్తారు. కొంతమంది భార్యాభర్తలు కిడ్స్ ముందే రొమాన్స్ చేస్తుంటారు. అది వారి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే పిల్లల ముందు ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, అనుచితంగా ప్రవర్తించడం వల్ల వాళ్లూ అలాగే తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక చిన్నారుల ముందు మందు తాగడం, సిగరెట్లు కాల్చడం వల్ల వారూ చెడు అలవాట్లకు గురయ్యే ఆస్కారం ఉంది. Share It

News November 5, 2025

పరిగి: ‘అన్నం పెట్టే రైతన్నలకు అండగా ఉంటాం’

image

వ్యవసాయానికి కరెంటు సరఫరా సరిగా లేక రాత్రి, పగలు అన్నదాతలు అవస్థలు పడుతున్నారని, లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని రైతులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. స్పందించిన ప్రభుత్వం రైతులకు నూతన ట్రాన్స్‌ఫార్మర్లను బుధవారం పంపిణీ చేశారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నలకు అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.