News November 5, 2025

జగిత్యాల: సౌదీలో రాయికల్ వాసి మృతి

image

సౌదీ అరేబియాలోని జెడ్డాలో రాయికల్ పట్టణానికి చెందిన సుతారి ధర్మయ్య(50) మంగళవారం రాత్రి రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా అక్కడి స్థానికులు తెలిపారు. దురదృష్టవశాత్తు మరణం సంభవించినట్లు దుబాయ్ వాసులు చెబుతున్నారు. అక్కడే ఉన్న మన తెలుగు వారు సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 23, 2026

పీరియడ్స్‌లో దైవ దర్శనం చేసుకోవచ్చా?

image

తీర్థయాత్ర సమయంలో పీరియడ్స్ వస్తే దైవ దర్శనం చేసుకోవచ్చా? అన్న సందేహంపై ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ స్పష్టతనిచ్చారు. ‘నెలసరి అనేది ప్రకృతి సిద్ధమైన ప్రక్రియే కానీ పాపం కాదు. యాత్రలో పీరియడ్స్ వస్తే, స్నానం చేసి శుచిగా ఉండి దూరం నుంచే దేవుడిని దర్శించుకోవచ్చు. పూజా సామగ్రిని తాకడం, ప్రసాదం వండటం వంటివి చేయకూడదు. భగవంతుడికి కావాల్సింది కేవలం నిర్మలమైన భక్తి మాత్రమే’ అని వివరించారు.

News March 23, 2026

నిర్మల్: వీటిపైనే ఫిర్యాదులు ఎక్కువ

image

కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ అభిలాష అభినవకు వినతులు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ వసతి గృహాలు తనికి చేస్తూ ఉండాలని తెలిపారు.

News March 23, 2026

ప్రతి దరఖాస్తును పరిశీలించి స్పందించాలి: నిర్మల్ కలెక్టర్

image

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆమె మాట్లాడారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.