News April 11, 2024
ఈనెల 15 నుంచి చేపల వేటపై నిషేధం
AP: చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు వేటపై విధించనున్న నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే బోట్లతో సహా వాటిలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటామని పేర్కొంది. ఏపీ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం 1994 సెక్షన్ (4) కింద శిక్ష పడుతుందని, డీజిల్ రాయితీతో పాటు అన్ని రకాల సౌకర్యాలను నిలిపివేస్తామని తెలిపింది.
Similar News
News November 15, 2024
IPL: రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌లో 81 మంది ఆటగాళ్లు
మెగా వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితాను IPL <
News November 15, 2024
IPL ఆక్షనీర్‌గా మల్లికా సాగర్?
ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వాహకురాలిగా మరోసారి మల్లికా సాగర్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. 2023 వేలం కూడా ఆమెనే నిర్వహించారు. ఐపీఎల్ చరిత్రలోనే వేలం ప్రక్రియను పూర్తి చేసిన తొలి మహిళగా మల్లికకు రికార్డు ఉంది. గత వేలంలో ఆమె నిర్వహించిన ప్రత్యేక విధానానికి ప్రశంసలు రావడంతో మళ్లీ ఆమెనే ఎంపిక చేసినట్లు టాక్. కాగా WPL వేలం నిర్వాహకురాలిగా కూడా ఆమె వ్యవహరించారు. ఈ నెల 24న జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుంది.
News November 15, 2024
రూ.50 కోట్ల క్లబ్‌లోకి ‘క’
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీ రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు మేకర్స్ తెలిపారు. వరల్డ్ వైడ్‌గా తెలుగులోనే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లు ప్రకటించారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూవీగా నిలిచింది. కాగా ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేస్తున్నారు. దీనిని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు.