News November 5, 2025

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఎస్పీ

image

ప్రొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.6.28 లక్షల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News March 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
➤ 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,770
➤ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,508
➤ వెండి 10 గ్రాముల ధర రూ.2,720.

News March 12, 2026

కడప: రేపు వైవీయూ కాన్వకేషన్ .. ఏర్పాట్లు పూర్తి

image

యోగి వేమన విశ్వవిద్యాలయం కాన్వకేషన్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు లోపు విద్యార్థులు తిరుపతి బైపాస్ రోడ్డులోని డీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందన్నారు. వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తామన్నారు.

News March 12, 2026

కడప: రేపు రూ.125.97 కోట్లు అకౌంట్లోకి జమ

image

కడప జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ- పీఏం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులు డేటాను సిద్ధం చేశారు. మూడో విడత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 2,15,283 మంది రైతులకు రూ.125.97 కోట్లు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో అన్నదాత సుఖీభవ కింద రూ.86.11 కోట్లు, PM కిసాన్ కింద రూ.39.86 కోట్లు విడుదల చేయనున్నారు.