News November 5, 2025

8న తిరుపతికి పవన్ కళ్యాణ్ రాక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. ఈనెల 8న ఉదయం 10 గంటలకు రేణిగుంటకు వస్తారు. తర్వాత మామండూరు అటవీ కార్యాలయాన్ని తనిఖీ చేస్తారు. కలెక్టరేట్‌లో అటవీ శాఖ అధికారులతో జరిగే సమీక్షలో పాల్గొంటారు. 9వ తేదీన పలమనేరు వెళ్తారని సమాచారం. దీనిపై షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది.

Similar News

News March 12, 2026

టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా కొనసాగడం కష్టమే: మెక్‌గ్రాత్

image

భారత పేసర్ బుమ్రా టెస్ట్ భవిష్యత్తుపై AUS దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ ఆందోళన వ్యక్తం చేశారు. వయస్సు పెరుగుతుండడం, వర్క్ లోడ్ కారణంగా బుమ్రా వరుసగా టెస్టుల్లో ఆడటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లతో జరిగే టెస్టులకే బుమ్రా పరిమితం కావచ్చని, ఇది టెస్ట్ క్రికెట్‌కు పెద్ద లోటని అన్నారు. T20ల్లోనూ టెస్ట్ లెంగ్త్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అరుదైన బౌలర్ బుమ్రా అని ప్రశంసించారు.

News March 12, 2026

కేంద్ర మంత్రి గడ్కరీతో ఆదిలాబాద్ ఎంపీ భేటీ

image

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భీంపూర్, అర్లి కరంజీ మీదుగా మహూర్ వరకు NH-44 (బోరాజ్)ను అప్‌గ్రేడ్ చేయడం, భీంపూర్-కరంజీ రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు మావాలా నుంచి చందా వరకు ఉన్న పాత NH-7 విస్తరణ అభివృద్ధి, ఉపస్నాల వరకు NH-44ను నాలుగు లైన్లుగా మార్చడం గురించి చర్చించారు. చర్యలకు మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.

News March 12, 2026

సిమెంట్ రంగంపై యుద్ధ ప్రభావం.. ధరల పెంపు తప్పదా?

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇండియాలో సిమెంట్ రంగంపైనా పడిందని ‘ఎలారా క్యాపిటల్’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. గత 15రోజుల్లో ముడి చమురు 39%, థర్మల్ కోల్ 14%, పెట్ కోక్ ధరలు 18% పెరిగాయని తెలిపింది. తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడనుందని, FY27 Q2లో లాభాలు భారీగా తగ్గొచ్చని అంచనా వేసింది. ఈ భారాన్ని భర్తీ చేసేందుకు ఒక సిమెంట్ బస్తాపై ₹6 వరకు పెంచాల్సిన అవసరముందని చెప్పింది.