News November 5, 2025
ANU: బీటెక్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత జులై నెలలో జరిగిన బీటెక్ ll, lV ఇయర్స్ ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. 179 మందికి గాను 100 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఈ నెల 17వ తేదీ లోపు రూ. 2,070 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
Similar News
News November 6, 2025
ప్రభుత్వ వర్సిటీల్లో యూనిఫైడ్ యాక్ట్: లోకేశ్

AP: ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఉన్నత, ఇంటర్ విద్యపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని ఆదేశించాను. ITIలు, వర్సిటీలను NOVలోగా పరిశ్రమలతో అనుసంధానించాలి. విద్యార్థుల 100% క్యాంపస్ సెలక్షన్స్‌కు చర్యలు తీసుకోవాలి. ఇంటర్‌లో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు చేపట్టాలి’ అని తెలిపారు.
News November 6, 2025
హైటెక్స్‌లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025

HYDలో నవంబర్ 25- 28 వరకు దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో జరగనుంది. వన్ నేషన్ వన్ EXPO థీమ్‌తో జరిగే ఈవెంట్‌లో 50 దేశాల నుంచి 500 ఎగ్జిబిటర్స్, 40,000 కుపైగా సందర్శకులు పాల్గొంటారు. 35,000 చదరపు మీటర్లలో తాజా పౌల్ట్రీ సాంకేతికతలు, సస్టైనబుల్ సొల్యూషన్స్ ప్రదర్శించబడతాయి. దేశ పౌల్ట్రీ రంగం రూ.1.35 లక్షల కోట్లతో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.
News November 6, 2025
HYD: గోపి నా పెద్దకొడుకని అక్షరను హత్తుకున్న అవ్వ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రహమాత్‌నగర్‌లోని ఫాతిమా నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో ఓ అవ్వ ‘గోపీ నా పెద్ద కొడుకు అని గుర్తు తలుచుకుంటూ.. నా మనుమరాలు అని ఆప్యాయంగా అక్షరను దగ్గరకు తీసుకొని మనస్ఫూర్తిగా దీవించారు. మాగంటి సునీత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గంటెపాక నరేష్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.


