News November 5, 2025
NTR: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలో జులై, ఆగస్టు 2025లో నిర్వహించిన ఎం.ఏ. ఇంగ్లిష్, జర్నలిజం, సోషల్ వర్క్, సోషియాలజీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://anucde.info/ResultsJAug25.asp చూడాలని ANU(దూరవిద్య) పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News November 6, 2025
KNR: స్థానిక సమరం ఎప్పుడు..? బైపోల్ ప్రచారంలో బిజీగా పెద్దలు

BCరిజర్వేషన్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, ఎన్నికలను ఎప్పుడనే విషయాన్ని ఈనెల 24లోపు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. CM, మంత్రులు జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో బిజీగా ఉండటంతో ప్రకటన మరింత ఆలస్యం కానుంది. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 1,216 GPలు, 60 ZPTCలు, 646 MPTC స్థానాలున్నాయి.
News November 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 6, 2025
‘ఫ్యాషన్ పెళ్లిళ్లు వద్దు’

ఉమ్మడి అనంత జిల్లాల ప్రభుత్వ ఖాజీలు గుంతకల్లు ప్రభుత్వ ఖాజీ కార్యాలయంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. సినిమా షూటింగ్‌లు, ఫొటో సెషన్‌ల ప్రదర్శనతో నిఖా పవిత్రత కోల్పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిఖా కేవలం ఇస్లామియా పద్ధతిలో సంప్రదాయంగా జరగాలన్నారు. ఫ్యాషన్ పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని, సంప్రదాయ నిఖా విధానాల పునరుద్ధరణ చేయాలని అన్నారు. నిజమైన దైవబంధాన్ని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.


