News November 5, 2025

జగిత్యాల: విచిత్ర ఘటన.. నెల రోజుల్లో ఏడుసార్లు కాటేసిన పాము

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగించే 28 ఏళ్ల యువకుడిని గత నెలలో పాము కాటు వేసింది. వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే మరోసారి కాటేయడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి రాగానే మళ్లీ కాటు వేసింది. ఇలా నెలరోజుల వ్యవధిలో ఒకే వ్యక్తికి ఏడుసార్లు పాము కాటు వేయడంతో పాము పగ పట్టినట్టు ఉందని కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు.

Similar News

News March 17, 2026

జగిత్యాల: కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

image

మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరితే కాంగ్రెస్‌కి పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీ అంతర్గత అసంతృప్తి బహిర్గతం కావడంతో కాంగ్రెస్‌లో పరిస్థితులపై చర్చ సాగుతోంది. ఈ పరిణామం భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

News March 17, 2026

ఎన్టీఆర్: సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో డిగ్రీ చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ (2021-22, 2022-23 బ్యాచ్‌లు) సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి 20 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ చూడాలన్నారు.

News March 17, 2026

SRH కెప్టెన్సీ రేసులో ఇద్దరు?

image

SRH జట్టులో కెప్టెన్ కమిన్స్ ఎప్పుడు చేరుతారో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మను కెప్టెన్ చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. తాజాగా ఇషాన్ కిషన్ పేరు కన్ఫర్మ్ అయిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇషాన్‌‌కు 2016 U19 WCలో ఇండియాకు, డొమెస్టిక్ క్రికెట్‌లో ఝార్ఖండ్‌కు కెప్టెన్సీ చేసిన అనుభవముండగా, అభిషేక్‌ 2016 U19 ఆసియా కప్‌లో INDకు కెప్టెన్‌గా చేశారు. మరి వీరిలో SRH కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది?