News November 5, 2025

VJA: దుర్గమ్మ సన్నిధిలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు

image

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మని సినీ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి శిరీష దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ నూతన దంపతులు అమ్మవారి ఆశీస్సుల కోసం ఆలయాన్ని సందర్శించారు. ఏపీ సీఎం కుటుంబ సంబంధీకుడైన రోహిత్ దంపతులకు దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ, స్వాగతం పలికారు. అనంతరం, ఛైర్మన్ ఈఓ అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News March 4, 2026

అన్నమయ్య: యుద్ధం.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి!

image

యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భరోసానిచ్చారు. ఆయా దేశాల్లో అన్నమయ్య జిల్లా వాసులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఢిల్లీ ఏపీ భవన్‌, ఏపీలోనూ 24 గంటల కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని మంత్రి వెల్లడించారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 0863-2340678 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

News March 4, 2026

బాపట్ల: భూములకు హక్కులు కల్పించే ప్రక్రియ వేగవంతం

image

నిషేధిత భూముల జాబితాలో ఉన్న అర్హుల భూములకు హక్కులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి ఆదేశించారు. అమరావతి నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. వ్యవసాయ, నిషేధిత భూముల వివరాలపై తక్షణ నివేదిక ఇవ్వాలని, పీజీఆర్ఎస్ అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.

News March 4, 2026

వనపర్తి: పదో తరగతి ఫలితాల్లో 100% లక్ష్యం: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం వెల్టూరులోని బీసీ బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.