News November 5, 2025

హాస్టల్ ఘటనపై తిరుపతి కలెక్టర్ సీరియస్

image

తిరుపతి వెల్ఫేర్ హాస్టల్ <<18201992>>ఘటనలో <<>>వాచ్‌మెన్ హరి గోపాల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఇప్పటికే అతడిని సస్పెండ్ చేయగా.. ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ముని శంకర్ పర్యవేక్షణ లోపం ఉండటంతో ఆయనను సైతం సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్యామసుందర్ రావుకు ఛార్జ్ మెమో జారీ చేశారు.

Similar News

News March 25, 2026

పల్నాడు: ఎమ్మెల్యేలకు టెన్షన్ స్టార్ట్..!

image

నియోజకవర్గాల పునర్విభజన అంశం పల్నాడు జిల్లా ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. ప్రస్తుతం 7గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 11కి పెరిగే అవకాశం ఉండటంతో, రిజర్వేషన్ల మార్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఎవరి సీటుకు ఎసర పెడతాయోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. తారుమారయ్యే మండలాలపై పట్టు సాధించడం ఇప్పుడు అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది.

News March 25, 2026

కాంగ్రెస్‌కు గుడ్‌బై.. 7000 మందితో BRSలోకి జీవన్‌రెడ్డి?

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌కు నేడు ఆయనతో పాటు సుమారు 7000 మంది అనుచరులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన 10 మంది MLAలను టార్గెట్‌గా చేసుకొని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది. వచ్చేనెల 5 నుంచి 10లోపు భారీ సభలో మాజీ CM KCR సమక్షంలో BRSలో చేరనున్నట్లు సమాచారం.

News March 25, 2026

పునర్విభజన ఉత్కంఠ.. బూర్గంపాడు కేంద్రంగా కొత్త నియోజకవర్గం?

image

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసెంబ్లీ స్థానాలు 10 నుంచి 15కు పెరిగే అవకాశముండటంతో.. బూర్గంపాడు, భద్రాచలం, పాల్వంచ ప్రాంతాలను కలిపి కొత్త సీటు ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గతంలో నియోజకవర్గంగా ఉన్న బూర్గంపాడును మళ్లీ కేంద్రం చేయాలని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల నేతల్లో అప్పుడే ఉత్కంఠ నెలకొంది.