News November 5, 2025
మేడారం: ‘ఛాలెంజ్‌గా పనులు పూర్తి చేయండి’

మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ఆవరణలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను ఆర్ అండ్ బి ఈఈ మోహన్ నాయక్ పరిశీలించారు. చేపట్టిన పనులను ఛాలెంజ్‌గా తీసుకుని సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. ఈ నెల 10లోపు పిల్లర్స్, గ్రానైట్ పనులను తప్పక పూర్తి చేయాలని ఈఈ ఆదేశించారు.
Similar News
News March 19, 2026
నిజామాబాద్: ‘బ్యాంక్ ఖాతాలు విక్రయం.. ఐదుగురి అరెస్ట్’

నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఖాతాల ద్వారా మూడు నెలల్లో రూ.31 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇంకా మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానంతో విచారణ కొనసాగుతోంది. ప్రజలు తమ బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని సీపీ హెచ్చరించారు.
News March 19, 2026
ఉగాది ఈవెంట్ సన్నాహాలను పరిశీలించిన కలెక్టర్ డా.లక్ష్మీశ

విజయవాడలోని అంబేడ్కర్ కన్వెన్షన్ హాలులో జరగనున్న ఉగాది ఈవెంట్ సన్నాహాలను జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. ఈవెంట్ నిర్వహిస్తున్న AP క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ చైర్ పర్సన్ పి.తేజస్వి, JC ఇలక్కియకు కలెక్టర్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని కళారత్న, ఉగాది పురస్కారాలను ప్రధానం చేయనున్నారు.
News March 19, 2026
ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం: కలెక్టర్

నూతన సంవత్సరాది ఉగాది పండుగను తెలుగు సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అనంతపురం కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ గురువారం ఉగాది పండుగను జిల్లా సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.


