News November 5, 2025

MDK: వెన్నెల వెలుగుల్లో వనదుర్గమ్మ ❤️

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపురం వద్ద కార్తీక పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో వనదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఒకే ఫ్రేమ్‌లోకి చంద్రుడు, ఆలయం, అమ్మవారి విగ్రహం రావడంతో ఈ సుందర దృశ్యాన్ని భక్తులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

Similar News

News March 25, 2026

రామ‌తీర్థం గిరి ప్రదర్శన రోడ్డును ప్రారంభించిన డిప్యుటీ సీఎం

image

రాష్ట్రంలో ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షించేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర‌ ఉప‌ముఖ్య‌మంత్రి కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. రామ‌తీర్థం నీలాచ‌లం చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న కోసం రూ.3.40కోట్ల గ్రామీణ ఉపాధిహామీ నిధుల‌తో 3.7 కిలోమీట‌ర్ల మేర కొత్త‌గా నిర్మించిన గిరివ‌లయం బీటీ ర‌హ‌దారిని ప‌వ‌న్ బుధ‌వారం అమ‌రావ‌తి నుంచి వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News March 25, 2026

రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం!

image

TG: రానున్న 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎండ తగ్గుముఖం పట్టింది.

News March 25, 2026

2 నెలలకు సరిపడా నిల్వలున్నాయి: మంత్రి ఉత్తమ్

image

TG: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2 నెలలకు సరిపడా నిల్వలున్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రోజువారీ పెట్రోల్, డీజిల్ డిమాండ్ 25% పెరిగిందని చెప్పారు. ట్యాంకర్ల ఆలస్యం కారణంగా, కొన్ని పెట్రోల్ పంపులు మూసివేశారని పేర్కొన్నారు. దేశంలో 60 రోజుల పెట్రోలియం నిల్వలు ఉన్నాయన్నారు. ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని HYD CP సజ్జనార్ తెలిపారు.