News November 6, 2025

పున్నమి వెలుగుల్లో వేములవాడ రాజన్న ఆలయం..!

image

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం పున్నమి వెలుగుల్లో కాంతులీనుతోంది. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా పున్నమి చంద్రుడు మరింత ప్రకాశవంతం కావడంతో ఆ వెలుగులు రాజన్న ఆలయంపై ప్రసరించి ఆలయ ప్రాంగణం మరింత ద్విగుణీకృతంగా కనిపిస్తోంది. పట్టణానికి చెందిన సీనియర్ ఫొటోగ్రాఫర్ రాజయ్య కెమెరాకు చిక్కిన ఈ చిత్రం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. SHARE IT

Similar News

News March 21, 2026

విజయవాడ జీజీహెచ్‌లో క‌లెక్ట‌ర్ త‌నిఖీలు

image

విజ‌య‌వాడలోని న్యూ జీజీహెచ్‌ను కలెక్టర్ ల‌క్ష్మీశ శ‌నివారం తనిఖీ చేశారు. అనంతరం ఆసుప‌త్రి ద్వారా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. అదేవిధంగా ఆసుప‌త్రిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలను పరిశీలించారు. యూత్ టైం బ్యాంక్ మొబైల్ యాప్‌ను పరిశీలించి వాలంటీర్, రోగి వివరాలు టైం బ్యాంకులో నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టారు.

News March 21, 2026

నార్నూర్: రూ.2,40,000 విలువగల గంజాయి స్వాధీనం

image

నార్నూర్ మండలంలోని మాలేపూర్‌లో సాగు చేస్తున్న గంజాయి తోటపై శనివారం పోలీసులు దాడి చేశారు. సీఐ ప్రసాద్, SI శ్రీసాయి వివరాల ప్రకారం.. మాలేపూర్‌కు చెందిన బాలాజీ తన వ్యవసాయంలో గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 24 మొక్కలు స్వాధీనం చేశారు. దాని విలువ రూ.2,40,000 ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 21, 2026

ఇంద్రవెల్లిలో రేపు రగల్ జెండా అత్యవసర సమావేశం

image

ఇంద్రవెల్లిలోని రగల్ జెండా భవనంలో ఆదివారం ఆదివాసీల అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రగల్ జెండా కమిటీ ఛైర్మన్ తొడసం నాగోరావ్ తెలిపారు. ఇంద్రవెల్లి ఆదివాసీ అమరవీరుల ఆశయ సాధన కోసం ఏప్రిల్ 20న నిర్వహించే కార్యక్రమంపై చర్చించనున్నామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ఉద్యమకారులు, నాయకులు హాజరుకావాలని ఆయన కోరారు.