News November 6, 2025
జగిత్యాల: రాయికల్‌లో కానిస్టేబుల్‌పై దాడికి యత్నం

రాయికల్ మండలం కుమ్మరిపల్లికి చెందిన దొంతి సాయి(23), గంజాయి కేసులో పరారీలో ఉండగా రాయికల్ బస్టాండ్ వద్ద కానిస్టేబుల్ వెంకటేశ్ అతడిని పట్టుకున్నాడు. స్టేషన్‌కు తీసుకెళ్తుండగా సాయి బండిని వేగంగా నడుపుతూ కానిస్టేబుల్‌ను కిందపడేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. గాయాలతోనూ అతడిని తిరిగి పట్టుకున్నాడు. ఈ సమయంలో సాయి తండ్రి మురళి, అన్న నాగరాజు అడ్డుపడడంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
Similar News
News March 21, 2026
డిన్నర్‌కు వెళ్లా అంతే..: పుట్టా మహేశ్

AP: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో TDP అధిష్ఠానానికి MP పుట్టా మహేశ్ వివరణ ఇచ్చారు. డిన్నర్ కోసం పిలిస్తే అక్కడికి వెళ్లానని, డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో TDP <<19392082>>షోకాజ్<<>> నోటీస్ ఇచ్చింది. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు TG మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికీ BRS షోకాజ్ నోటీస్ ఇవ్వగా ఆయన స్పందించాల్సి ఉంది.
News March 21, 2026
విశాఖ: ‘సోషల్ మీడియాలో జాబ్స్ ప్రకటనలు నమ్మవద్దు’

హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి & పరిశోధన కేంద్రం పేరుతో నర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులపై సోషల్ మీడియాలో నకిలీ నియామక ప్రకటనలు వెలుగు చూశాయి. పోస్టుల సంఖ్య, జీతం, అర్హతలు, చివరి తేదీ వివరాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆసుపత్రి నుంచి విడుదల కాలేదని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే సమాచారం ధ్రువీకరించుకోవాలని సూచించారు.
News March 21, 2026
నల్గొండ- మాచర్ల రైల్వే మార్గంపై వీడని నిరీక్షణ

నల్గొండ నుంచి హాలియా మీదుగా మాచర్ల వరకు రైల్వే లైన్ కల సాకారం కోసం సాగర్ ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్లలో కేంద్రం రూ.2 కోట్లు కేటాయించి, రెండుసార్లు సర్వే నిర్వహించినా పనులు మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి, ఈ నిరీక్షణకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు.


