News November 6, 2025

పరిగి: పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ

image

కార్తీక మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాల దర్శనం కోసం సేవలు అందిస్తున్నట్లు పరిగి ఆర్టీసీ DM కృష్ణమూర్తి బుధవారం తెలిపారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి, భీమవరం సోమేశ్వరస్వామి, పాలకొల్లు రామలింగేశ్వర స్వామి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి దర్శనం కోసం ప్రత్యేక ప్యాకేజీలో బస్సులు నడుపుతున్నామన్నారు. ఒక్కరికి రూ.2,500 ఛార్జీ అని, నవంబర్ 9న బయలుదేరి 11న తిరిగి వస్తుందన్నారు.

Similar News

News March 14, 2026

NGKLలో నిప్పుల కొలిమి.. 39 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నాగర్ కర్నూల్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కల్వకుర్తిలో 39.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలైన శిరసనగండ్ల (38.9°C), వెల్టూర్, పెద్దకొత్తపల్లి (38.8°C)లలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

News March 14, 2026

అమెరికాలో వరంగల్ ఉపాధ్యాయురాలి మృతి

image

వరంగల్ నగరం దేశాయిపేట రోడ్డు రామనాథపురి కాలనీకి చెందిన చిదురాల విజయరాణి(55) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. ఆమె పైడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన చిన్న కుమార్తె పూజ ప్రసవం కావడంతో, మనవడిని చూసేందుకు ఆమె అమెరికా వెళ్లారు. రెండు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడి ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.

News March 14, 2026

భీమిలి: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

image

భీమిలి పరిధి కాపుల ఉప్పాడలో ఉంటున్న అప్పలరాజు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అప్పలరాజు తీవ్రంగా గాయపడడంతో గీతం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇక్కడి నుంచి కేజీహెచ్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు భీమిలి పోలీసులు తెలిపారు.