News November 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News March 24, 2026

ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేసిన స్విగ్గీ.. నెటిజన్ల అసహనం!

image

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారం జొమాటో ₹13.50గా ఉన్న ఫీజును ₹14,90 చేసింది. తాజాగా స్విగ్గీ ₹14.99 నుంచి ₹17.58కి పెంచింది. చమురు ధరలు పెరగడం, ఇంధన కొరతే పెంపునకు కారణంగా తెలుస్తుండగా దీనిపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయని అంటున్నారు.

News March 24, 2026

క్యాబినెట్ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

TG: రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కేరళం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక క్యాబినెట్ విస్తరణ చేసుకోవచ్చని CM రేవంత్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులకోసం ఇప్పటికే పలువురు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. అధిష్ఠానం, CMను కలిసి విన్నవిస్తున్నారు. రాజగోపాల్, ప్రేమ్ సాగర్, మల్‌రెడ్డి రంగారెడ్డి వంటివారు ఈ రేసులో ఉన్నారు.

News March 24, 2026

భారీగా పెరిగిన స్పోర్ట్స్ ఎకానమీ.. 89% క్రికెట్ నుంచే

image

ఇండియన్ స్పోర్ట్స్ ఎకానమీ తొలిసారిగా $2B మార్కును క్రాస్ చేసింది. 2025లో ₹18,864Crకు($2.1B) చేరినట్లు WPP మీడియా రిపోర్ట్ వెల్లడించింది. 2024తో (₹16,633Cr) పోలిస్తే 13.4% పెరిగింది. ఇందులో క్రికెట్ నుంచే 89% రావడం గమనార్హం. గత నాలుగేళ్లలో స్పోర్ట్స్ ఎకానమీ రెట్టింపయ్యింది. 2021లో ₹9,530Crగా ఉండేది. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, ఎండార్స్‌మెంట్ల ఆదాయం పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.