News November 6, 2025

నవంబర్ 6: చరిత్రలో ఈరోజు

image

* 1913: మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేశారు
* 1940: గాయని, రచయిత శూలమంగళం రాజ్యలక్ష్మి జననం
* 1951: భారత మొదటి ప్రధాన న్యాయమూర్తి హీరాలాల్ జెకిసుందాస్ కనియా మరణం
* 1985: బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ మరణం(ఫొటోలో)
* పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం

Similar News

News March 22, 2026

మూడో రోజే ₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2

image

రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ మైల్‌స్టోన్‌ని దాటింది. ఇండియాలో ₹339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా ఓవర్సీస్ మార్కెట్‌లో ₹96 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు భారీ ఆక్యుపెన్సీ లభిస్తోంది.

News March 22, 2026

ENG కోచ్ మెక్‌కల్లమ్‌పై సంచలన ఆరోపణలు

image

ENG కోచ్ మెక్‌కల్లమ్‌ మద్యం, పొగ తాగే ప్లేయర్లకే ప్రయారిటీ ఇస్తారని ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. యాషెస్ సిరీస్ మధ్యలో 6 రోజులు ప్లేయర్లు మద్యం తాగినట్లు ఆరోపణలున్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్లే టీమ్ ఓడినట్లు కొందరు ఆటగాళ్లు అభిప్రాయపడినట్లు సమాచారం. ECB మీటింగ్‌లో స్టోక్స్, మెక్‌కల్లమ్‌ ఒకరినొకరు నిందించుకున్నట్లూ వార్తలొస్తున్నాయి. కాగా ఆ ఆరోపణలను మెక్‌కల్లమ్‌ కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.

News March 22, 2026

అంగన్వాడీలకు కొత్త ఫోన్లు!

image

TG: అంగన్వాడీలకు కొత్త ఫోన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 38వేలకు పైగా శామ్‌సంగ్ ఫోన్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. 10 రోజుల్లో CM రేవంత్ వాటిని అందజేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన ఫోన్లు పాతవై పోవడంతో కొత్తగా 4G ర్యామ్, 64GB మెమొరీ సామర్థ్యం ఉన్నవాటిని ఇవ్వాలని నిర్ణయించిందట. అంగన్వాడీ టీచర్ ప్రతిరోజు ఫోన్‌లో పోషణ్ ట్రాకర్ యాప్‌లో 14 రకాల వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.