News April 11, 2024

ఉమ్మడి పాలమూరులో రంజాన్ సందడి..!

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాల్లో వ్యాపార కేంద్రాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ముస్లింలు పగలంతా ధ్యానంలో గడుపుతారని భావించిన వ్యాపారులు.. అర్ధ రాత్రి వరకు షాపులను తెరిచి ఉంచుతున్నారు. వస్త్రాలు,మెహందీ, మిస్వాక్, ఇత్తర్ (సుగంధ ద్రవ్యాలు), సుర్మా, గృహ పరికరాలతో పాటు సేమియాలు, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల్లో సందడి నెలకొంది.

Similar News

News October 1, 2024

NRPT: డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు

image

డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు సత్తాచాటారు. 50ఏళ్ల వయసులో రాకొండకు చెందిన జంపుల గోపాల్‌ తెలుగు పండిట్‌ కేటగిరిలో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు, స్కూల్‌ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంకు పొందారు. ఆయన కుమారుడు భానుప్రకాశ్‌ నారాయణపేట జిల్లా స్థాయిలో గణితంలో స్కూల్‌ అసిస్టెంట్‌ 9వ ర్యాంకు సాధించారు. దీంతో తండ్రీకొడుకులకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

News October 1, 2024

MBNR: సర్వం సిద్ధం.. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన

image

డీఎస్సీ పలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మెరుగైన ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్స్ పరిశీలన నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, ఎంపికైన అభ్యర్ధుల ఫోన్ కు SMS/మెయిల్ ఐడీకి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని, 1:3 నిష్పత్తిలో DEOల వెబ్ సైట్ లో ఉంచుతామని డీఈవోలు తెలిపారు.

News October 1, 2024

“దేవద్రోణి తీర్థం” పుష్కరఘాట్‌లో ఘాతుక చతుర్దశి !

image

అలంపూర్ పుణ్యక్షేత్రం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న “దేవద్రోణి తీర్థం”లో మంగళవారం ఘాతుక చతుర్దశి చేస్తారు. మహాలయపక్షాల సందర్భంగా దేవద్రోణి తీర్థమైన పుష్కరఘాట్ లో ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని ఈ ప్రాంతవాసుల విశ్వాసం. సాధారణ మరణాలు కాకుండా బలవన్మరణాలు, అకాల(యాక్సిడెంట్) మరణాలతో మృతి చెందిన వారికి వారి సంతానం ఈ ప్రాంతంలో తిలా తర్పనాలు, శ్రాధ్ద ఖర్మలు చేస్తారు.