News November 6, 2025
భద్రాచలం బస్ సర్వీస్ పునరుద్ధరణ: జిల్లా ఆర్టీసీ అధికారి

పాడేరు నుంచి భద్రాచలానికి ఆర్టీసీ బస్ సర్వీస్ పునరుద్ధరిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి పి.శ్రీనివాస్ రావు బుధవారం తెలిపారు. పాడేరు నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు చేరుతుందన్నారు. అలాగే భద్రాచలం నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి సాయంత్రానికి పాడేరు చేరుతుందన్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం ఉందని ఆర్టీసీ అధికారి తెలిపారు.
Similar News
News November 6, 2025
డెయిరీఫామ్‌తో రూ.15 లక్షలు నష్టపోయారు..

TG: రెండేళ్ల క్రితం డెయిరీఫామ్ ప్రారంభించి రూ.15లక్షలుపైగా నష్టపోయారు కామారెడ్డి(D) పెద్దమల్లారెడ్డికి చెందిన ఐదుగురు మిత్రులు. రూ.27 లక్షల పెట్టుబడి, 17 గేదెలతో ఫామ్ ప్రారంభించారు. గేదెల ఎంపికలో తప్పులు, అనుభవలేమి, ఊహించని ఖర్చులతో 6 నెలల క్రితం ఫామ్ మూసేశారు. అందుకే డెయిరీఫామ్ పెట్టేముందు పూర్తిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ✍️ పాడి, వ్యవసాయ సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 6, 2025
కరివేపాకుతో మెరిసే చర్మం

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. * కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. * కరివేపాకు మరిగించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.
News November 6, 2025
కొత్త రెవెన్యూ డివిజన్‌గా ‘మడకశిర’

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. పాలనా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. మడకశిర, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగలి మండలాలతో మడకశిర కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కొనసాగనుంది.


