News November 6, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసుల బదిలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ఎస్పీ సతీశ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఏఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, 11 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరంతా బదిలీ అయిన స్థానాల్లో 3 రోజుల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News March 23, 2026
భూలోకానికి వచ్చిన శ్రీవారు.. కారణం ఇదే.!

కలియుగ ప్రారంభంలో వేంకన్న వైకుంఠం వీడి భూలోకంలోని వెంకటాచలం వచ్చారట. భూ వరాహ స్వామి గుర్తించి ఆరాతీశారు. తన వక్షస్థలంపై భృగుమహర్షి పదప్రహరము చేయడంతో లక్ష్మీదేవి వైకుంఠం వీడి కొల్హాపురం వెళ్లిపోయిందని, ఆ దుఃఖంతో తాను పుట్టలో నివసిస్తున్నానని శ్రీనివాసుడు చెప్పాడట. ఇక్కడే నివాస స్థలమును ఇవ్వమని వేంకన్న భూ వరాహునిని కోరగా ధనం ఇచ్చినచో స్థలం ఇచ్చెదనని వరాహ స్వామి పేర్కొన్నారట. <<19452550>>NEXT<<>>
News March 23, 2026
WGL: ఔట్సోర్సింగ్ డ్రైవర్ల నియామకాల్లో అక్రమాలు!

వరంగల్ ఆర్టీసీ రీజియన్లో ఔట్సోర్సింగ్ డ్రైవర్ల నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీలు దళారుల ద్వారా డ్రైవర్ల నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. పర్మినెంట్ ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు విద్యుత్ బస్సుల పెరుగుదలతో డ్రైవర్ల అవసరం తగ్గుతున్నా నియామకాలు కొనసాగుతుండటం సందేహాలకు తావిస్తోంది.
News March 23, 2026
ఆగిరిపల్లి: టీచర్లకు బెదిరింపు కాల్స్

ఆగిరిపల్లి మండలంలో ఉపాధ్యాయులను బెదిరించిన ఫేక్ అధికారుల ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఈవో వెంకట లక్ష్మమ్మ ఆదేశించారు. ఎంఈఓ హేబేలు మాట్లాడుతూ.. సూరవరం జడ్పీ హై స్కూల్స్ హెచ్ఎంలకు మధ్యాహ్నం భోజన పథకంలో అవకతవకలు జరిగాయని బెదిరిస్తూ అధికారుల పేరుతో ఫేక్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు చెప్పారు. సమాచారం తెలుసుకున్న డీఈవో ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించినట్లు వివరించారు.


