News November 6, 2025
పరకామణి చోరీ కేసు.. 30మందితో విచారణ

తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణ మొదలైంది. ఐదు బృందాలుగా అధికారులు ఏర్పడ్డారు. 20 మంది ప్రత్యక్షంగా, 10 మంది అధికారులు ఆఫీస్ నుంచి విచారణ కొనసాగించనున్నారు. డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గంగాధర్, ముగ్గురు డీఎస్పీలు, ఫోరెన్సిక్, సైబర్, ఐటీ విభాగం, లీగల్ విభాగం సభ్యులు విచారణలో పాల్గొంటారు. 28రోజుల్లో విచారణ పూర్తి చేసి హైకోర్టులో నివేదిక సమర్పించనున్నారు.
Similar News
News March 19, 2026
కేయూలో జీతాల్లేక అడ్డా కూలీల ఆందోళన!

కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో పనిచేస్తున్న 90 మంది అడ్డా కూలీలు 5 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. నెలకు రూ.6600 చెల్లించాల్సి ఉండగా బడ్జెట్ లేదంటూ వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హాస్టల్స్ డైరెక్టర్ డా.పోడేటి శ్రీనివాస్‌ను కలిసి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లెక్కల్లో తేడాల కారణంగా చెల్లింపులు ఆగినట్లు సమాచారం. జీతాలు ఇవ్వకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
News March 19, 2026
ప్రకాశం: ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 42 దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల (గ్రూప్-4: 12, క్లాస్-4: 30) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్ పోస్ట్‌లు ఉన్నాయి. అర్హులైన వారు ఏప్రిల్ 8 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.prakasam.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, దరఖాస్తులను ఒంగోలు కలెక్టరేట్‌లో సమర్పించాలని కలెక్టర్ రాజబాబు తెలిపారు.
News March 19, 2026
కొల్లాపూర్: వారసత్వపు పండుగ ఉగాది: మంత్రి

మన వారసత్వపు పండుగ ఉగాది అని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభివర్ణించారు. కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు, జాతిని సజీవంగా నిలుపుతాయన్నారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలి అని మంత్రి ఆకాంక్షించారు.


