News November 6, 2025
అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.
Similar News
News November 6, 2025
HYD: 10 మందికి ఊపిరినిచ్చిన ‘తండ్రి’

ఆ తండ్రి చనిపోయినా 10 మందిలో జీవిస్తున్నారు. మేడ్చల్ పరిధిలోని అత్వెల్లిలో గత వారం 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నారెడ్డి భూపతి రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తుదిశ్వాస విడిచినా.. 10మందికి ఆయన ఊపిరినిచ్చారు. అవయవాలు దానం చేసి 10 మందికి ప్రాణం పోసినట్లు ఆయన కుమారుడు నారెడ్డి నవాజ్ రెడ్డి తెలిపారు.
News November 6, 2025
అమన్‌జోత్ మంచి మనసు.. ❤️

భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ప్రతికా రావల్ (308 రన్స్)కు విన్నింగ్ మెడల్ దక్కని విషయం తెలిసిందే. గాయం కారణంగా ఆమెను 15 మెంబర్ స్క్వాడ్ నుంచి తప్పించడంతో ఆమెకు మెడల్ ఇవ్వలేదు. అయితే నిన్న ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ తన మెడలోని విన్నింగ్ మెడల్‌ను రావల్‌కు ఇచ్చారు. కౌర్ మెడల్ లేకుండా ఫొటో దిగారు. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News November 6, 2025
కుంకుమ పువ్వుతో ఎన్నో ప్రయోజనాలు

ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు తీసుకుంటే బిడ్డ తెల్లగా పుడతాడని చాలామంది భావిస్తారు. బిడ్డ చర్మ ఛాయ తల్లిదండ్రుల జీన్స్‌ని బట్టి ఉంటుందంటున్నారు నిపుణులు. కానీ ప్రెగ్నెన్సీలో కుంకుమపువ్వును తీసుకుంటే అజీర్తి, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, ఒత్తిడి, వేవిళ్లు, అధిక రక్తపోటు, ఐరన్ లోపం వంటివి తగ్గుతాయి. రోజుకు 2-3 రేకల్ని గ్లాసుపాలలో వేసుకొని తీసుకుంటే చాలు. దీనికి ముందు డాక్టరు సలహా తీసుకోవడం ముఖ్యం.


