News November 6, 2025

SKLM: ఈ నెల 11న ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

శ్రీకాకుళం జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల (పురుషులు, మహిళలు) కోసం జిల్లా స్థాయి క్రీడా ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేశ్ బాబు బుధవారం తెలిపారు. నవంబర్‌ 11న కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్‌ కాలేజీలో మొత్తం 19 క్రీడాంశాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేస్తారన్నారు.ఉద్యోగులు తమ డిపార్ట్‌మెంట్ గుర్తింపు కార్డుతో స్టేడియం వద్ద హాజరుకావాలన్నారు.

Similar News

News March 21, 2026

శ్రీకాకుళం: రూ.400 చేరిన చికెన్ ధర

image

రంజాన్ పండుగ సందర్భంగా శ్రీకాకుళం మార్కెట్లో చికెన్ ధర కొండెక్కింది. నిన్నటి వరకు కిలో రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ భారీగా పెరిగి రూ.400కు చేరింది. నగరంలో కిలో స్కిన్లెస్ చికెన్ ₹380-రూ.400 వరకు అమ్ముతున్నారు. చికెన్ విత్ స్కిన్ కేజీ ₹280-300 వరకు విక్రయిస్తున్నారు. రంజాన్ పండగ, ఉత్పత్తి తగ్గడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు. మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 21, 2026

శ్రీకాకుళం: ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు…!

image

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీల పాలకవర్గం గడువు ముగియనుంది. సమయం దగ్గర పడుతుండటంతో ప్రత్యేక అధికారులు జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మండలం యూనిట్ గా క్లస్టర్లు విభజించి గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించే ఏర్పాట్లు చేస్తున్నారు. పాలకవర్గం లేకుండా పంచాయతీల ప్రగతి కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.

News March 21, 2026

ఎచ్చెర్ల: పరీక్షలు రాస్తారు.. ఫలితాలు మాత్రం ఎప్పటికో..!

image

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పరీక్షల ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహణ తర్వాత కనీసం 30 నుంచి 45రోజుల వరకు ఫలితాలు వెల్లడికి పడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. రీ వాల్యుయేషన్ ఫలితాలు రావడంలో, సర్టిఫికెట్స్ అందజేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో ఆందోళన చెందుతున్నామని అంటున్నారు.