News November 6, 2025

పొత్కపల్లి రైల్వే స్టేషన్‌కు ఘన చరిత్ర.. మరిస్తే ఎట్లా..?

image

నిజాం నవాబు ప్రభుత్వం నాటి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పొత్కపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి గతంలో నాగ్‌పూర్‌కు మిరప ఎగుమతులు జరిగేవని, బొగ్గు ఇంజిన్లకు నీటి వసతి కలిగిన ముఖ్య కేంద్రంగా ఈ స్టేషన్ ఉండేదని గ్రామస్థులు తెలిపారు. 40 గ్రామాలకు అనుకూలంగా ఉన్న ఈ స్టేషన్‌ను నిర్వీర్యం చేయడం తగదని, అమృత్ భారత్ పథకంలో దీనిని చేర్చి అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు రైల్వే అధికారులను కోరుతున్నారు.

Similar News

News November 6, 2025

ఎల్లారెడ్డి: సలహాదారుడిని కలిసిన ఎమ్మెల్యే

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం పలు సమస్యలపై ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.

News November 6, 2025

మంచిర్యాల: కళ్లు దానం చేసిన ఎల్ఐసీ ఏజెంట్

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ఎల్ఐసీ ఏజెంట్ తన కళ్లను దానం చేశాడు. మంచిర్యాలకు చెందిన రాజన్న(56) నవంబర్ 1న ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. ఆయన చికిత్స పొందుతూ గురువారం మరణించగా కుటుంబ సభ్యులు ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకుకు దానం చేశారు.

News November 6, 2025

సంగారెడ్డి: చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య

image

చీమలకు భయపడి వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) మైర్మేకోఫోబియా‌తో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్‌(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.