News November 6, 2025
నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు: వరంగల్ కలెక్టర్

ఈ నెల 6 నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ సత్య శారద తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి, ఏపీసీ, కార్యదర్శి, సీఎండీ-సీసీఐతో పాటు జీఎంఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.జిల్లా వ్యాప్తంగా మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ వెల్లడించారు. దీంతో నేటి నుంచి చేపట్టాల్సిన సమ్మె వాయిదా పడింది.
Similar News
News March 13, 2026
కరీంనగర్ జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, సరఫరా యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో సమీక్షించిన ఆమె, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యవేక్షణ కోసం 12 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9154249727ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
News March 13, 2026
వంట గ్యాస్‌కు కొరత లేదు: కలెక్టర్ అనుదీప్

జిల్లాలో గృహావసరాల వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్యాస్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన సమీక్షించారు. కొరతపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
News March 13, 2026
భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ప్రాధాన్యత ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు రిటైనింగ్ వాల్, తీగల వంతెన పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ప్రధాన కాలువకు భూసేకరణ ముగించి, మిగిలిన అటవీ భూముల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.


