News April 11, 2024
ప్రచారాన్ని చూసేందుకు 25 దేశాలకు బీజేపీ ఆహ్వానం
లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ప్రచార తీరును చూసేందుకు బీజేపీ 25 దేశాల రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. అందుకు జర్మనీ, బ్రిటన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి 13 దేశాల్లోని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. త్వరలో భారత్‌కు రానున్న ఆయా దేశాల పార్టీల ప్రతినిధులు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారాలను చూడనున్నారు. అమెరికాలోనూ అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో అక్కడి పార్టీలను బీజేపీ ఆహ్వానించలేదు.
Similar News
News November 15, 2024
నిర్మలతో ముగిసిన చంద్రబాబు భేటీ
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఢిల్లీలోని నిర్మల నివాసంలో వీరిద్దరూ దాదాపు గంటసేపు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే చర్చ కొనసాగినట్లు సమాచారం. మరోవైపు ఇతర కేంద్ర మంత్రులనూ చంద్రబాబు కలుస్తారని వార్తలు వస్తున్నాయి.
News November 15, 2024
భారత ఆర్థిక వ్యవస్థ భేష్: మూడీస్
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మూడీస్ సంస్థ ప్రశంసించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.2 వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2025లో 6.6 శాతం, 2026లో 6.5శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది. ఆర్థికంగా దేశం చక్కటి దశలో ఉందని అభిప్రాయపడింది. అయితే, ప్రపంచ రాజకీయ పరిస్థితులు, వాతావరణ ఇబ్బందులు వెరసి మాంద్యం భయాల కారణంగా RBI కఠినతరమైన విధానాల్నే కొనసాగించొచ్చని అంచనా వేసింది.
News November 15, 2024
దీపావళి విందులో మద్యం, మాంసం: క్షమాపణ చెప్పిన బ్రిటన్ ప్రధాని ఆఫీస్
దీపావళి వేడుకల్లో <<14574659>>మద్యం, మాంసం<<>> వడ్డించడంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆఫీస్ క్షమాపణ చెప్పింది. పొరపాటు జరిగిందని మరోసారి ఇలా కాకుండా చూస్తామంది. కొన్నేళ్లుగా UK PM దీపావళి వేడుకలకు ఆతిథ్యమివ్వడం ఆనవాయితీగా వస్తోంది. భారతీయ నృత్య ప్రదర్శనలు, దీపాలు వెలిగించడం, ఇతర కార్యక్రమాల తర్వాత వెజిటేరియన్ విందు ఉంటుంది. ఈసారి మద్యం, మాంసం వడ్డించడంతో విమర్శలొచ్చాయి. దీనిపై పీఎం ఆఫీస్ స్పందించింది.