News November 6, 2025
కృష్ణా: హవే విస్తరణపై ఎమ్మెల్యేల ముఖ్య సూచనలివే.!

VJA-MTM జాతీయ రహదారి నం.65 రహదారి విస్తరణపై బుధవారం విజయవాడలో అధికారులు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. NH-65 రహదారిని NH-16తో మూడు ప్రాంతాలలో అనుసంధానం చేయాలని ఎమ్మెల్యేలు అధికారులను కోరారు. రహదారి సమీప గ్రామాల్లో అండర్ పాస్‌ల నిర్మాణం, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు.
Similar News
News November 6, 2025
గద్వాల్: మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు- SP

జిల్లాలో మహిళల, బాలికల రక్షణకై పోలీస్ షీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టి, తక్షణ స్పందనతో కాల్ చేసిన వారికి భరోసా, రక్షణ కల్పిస్తూ ఆకతాయిలకు చెక్ పెడుతుందని ఎస్పీ శ్రీనివాస రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైన నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312కు కాల్ చేసి సేఫ్‌గా ఉండాలని అన్నారు. మహిళలను, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 6, 2025
ఎల్లారెడ్డి: సలహాదారుడిని కలిసిన ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం పలు సమస్యలపై ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.
News November 6, 2025
మంచిర్యాల: కళ్లు దానం చేసిన ఎల్ఐసీ ఏజెంట్

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ఎల్ఐసీ ఏజెంట్ తన కళ్లను దానం చేశాడు. మంచిర్యాలకు చెందిన రాజన్న(56) నవంబర్ 1న ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. ఆయన చికిత్స పొందుతూ గురువారం మరణించగా కుటుంబ సభ్యులు ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకుకు దానం చేశారు.


