News November 6, 2025

అమరరాజా ఫ్యాక్టరీలో భారీ చోరీ..

image

యాదవరి మండలంలోని అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీలో భారీ చోరీని పోలీసులు ఛేదించారు. రూ.2.73 కోట్ల విలువైన లెడ్ బుష్ మాయంపై కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఏడుగురిని అరెస్టు చేసి దీనికి సంబంధించి రూ. 82 లక్షల విలువ చేసే మెటీరియల్, రూ. 68 లక్షల నగదు, రూ.1.18 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ ఉద్యోగుల సహకారంతో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 25, 2026

NHIDCLలో 15 డిప్యూటీ మేనేజర్ పోస్టులు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 15 డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నేషనల్‌ హైవేస్‌&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (NHIDCL) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతలు: CA/CMA/Mcom/MBA(ఫైనాన్స్‌). జీతం నెలకు రూ.50,000 – 1,60,000. వయసు 34 ఏళ్లు మించకూడదు. స్టేజ్‌-1, స్టేజ్‌-2 రాత పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2026. మరిన్ని వివరాలకు www.nhidcl.com చూడండి.

News March 25, 2026

పెట్రోల్ కోసం తిరుగుతుంటే ట్యాంక్ ఖాళీ!

image

తెలంగాణలో కొన్నిచోట్ల పెట్రోల్ కోసం వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కొన్ని బంకులు మూసేయగా, తెరిచి ఉన్న కొన్నింటి వద్ద భారీ క్యూలు కన్పిస్తున్నాయి. దీంతో మరో‌చోటుకు తిరుగుతూ ఎండలో నీరసించడంతో పాటు బండిలో ఉన్న కొద్దిపాటి పెట్రోల్ కూడా అయిపోతోందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెబుతున్నా బయట పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

News March 25, 2026

వనపర్తి: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపికలు

image

తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026-27విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి సుధీర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలురకు ఈనెల 31న, బాలికలకు వచ్చేనెల 1న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులు ధ్రువపత్రాలను తీసుకురావాలన్నారు.