News November 6, 2025

కృష్ణ: రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన డీఆర్ఎం

image

గుంతకల్లు డివిజినల్ రైల్వే మేనేజర్ చంద్ర ఎస్ గుప్తా బుధవారం కృష్ణ రైల్వే స్టేషన్‌ను తనిఖీలు చేశారు. ఈ తనిఖీ సందర్భంగా ప్రస్తుతం రైల్వే సిబ్బంది ఉన్న పాత భవనాలు, రైళ్లకు నీటి సదుపాయలను, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. అలాగే కృష్ణ మండల కేంద్రంలో వచ్చే కృష్ణానది పుష్కరాలకు రైల్వే స్టేషన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అదనపు సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు.

Similar News

News March 13, 2026

అయిజ: సీతారాముల తలంబ్రాలు బుక్ చేసుకోండి

image

భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణంలో ఉపయోగించిన తలంబ్రాలు పొందేందుకు పోస్టల్ శాఖ ద్వారా బుక్ చేసుకోవాలని అయిజ సబ్ పోస్ట్ మాస్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోస్ట్ ఆఫీస్‌లో ప్రజల నుంచి బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. రూ.151 తో ముత్యాల తలంబ్రాలు, రూ.450 తో అంతరాలయ అర్చన తలంబ్రాలు పొందే వీలుందన్నారు. భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 13, 2026

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించారా?

image

TG: ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా వేస్తున్నారు. పాడి రైతులు నిర్లక్ష్యం చేయకుండా జీవాలకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని, ఏమైనా సందేహాలుంటే సమీపంలోని వెటర్నరీ డాక్టర్లను సంప్రందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.

News March 13, 2026

సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

image

TG: సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. టికెట్ రేట్లు పెంచుతున్నట్లు సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.