News November 6, 2025

వరంగల్ నిట్‌లో ఉచితంగా GATE కోచింగ్

image

వరంగల్‌ నిట్(NIT)లో ఎస్సీ-ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచితంగా GATE కోచింగ్ నిర్వహిస్తున్నట్లు సెల్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 17 నుంచి 2026 జనవరి 9 వరకు ఈ కోర్సు 8 వారాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు గేట్ పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వివరాల కోసం ఎస్సీ-ఎస్టీ సెల్, నిట్ వరంగల్‌ను సంప్రదించాలని కోరారు.

Similar News

News November 6, 2025

BBL: ఆ బంతులు ప్రేక్షకులకే!

image

ఆస్ట్రేలియాలో జరిగే BBL, WBBL టోర్నీల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. బ్యాటర్ 6 లేదా 4 కొట్టిన బంతి ప్రేక్షకుల వద్దకు వెళితే దాన్ని వాళ్లు తీసుకెళ్లొచ్చు. అయితే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌కే ఇది వర్తిస్తుంది. ఆ ఓవర్‌లో ఎన్నిసార్లు కొట్టినా సరే బంతిని మారుస్తారు. మరోవైపు బాల్‌ను ప్రేక్షకులు తీసుకోకపోయినా రెండో ఓవర్ నుంచి కొత్తది వాడనున్నారు. ఆలస్యం జరగకుండా అంపైర్లు తమ వద్ద కొన్ని ఉంచుకోనున్నారు.

News November 6, 2025

ఊట్కూర్: నేల మట్టమైన వరి పంట

image

ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల కారణంగా ఊట్కూరు మండల కేంద్రంలోని పెద్ద జెట్రం అమ్మనికి చెందిన రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శివారులో వేసిన వరి పొలాలు నీట మునిగి సుమారు 50 ఎకరాల వరి పంట నష్టం చేతికొచ్చిన పంటలు నీటి పాలవడంతో అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పంట నష్టాన్ని అధికారులు వెంటనే అంచనా వేసి రైతులను ఆదుకోవాలని మాజీ MPTC కిరణ్ డిమాండ్ చేశారు.

News November 6, 2025

IMMTలో 30 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(<>IMMT<<>>)లో 30 పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించింది. అర్హతగల అభ్యర్థులు NOV 21 వరకు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్, Sr సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, ఎంటెక్, BE, బీటెక్ , PhD ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.immt.res.in/