News November 6, 2025
SRP: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు శిబిరాలు

సింగరేణిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు నవంబర్‌లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల 12, 13 తేదీల్లో శ్రీరాంపూర్, 17, 18 తేదీల్లో మందమర్రి, 24, 25 తేదీల్లో బెల్లంపల్లి, గోలేటి ఏరియాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశాన్ని సీఎంపీఎస్, సీపీఆర్ఎంఎస్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
Similar News
News March 13, 2026
గద్వాల: రేపు జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ వెనుక ఉన్న హెలిప్యాడ్‌ను, వివాహ వేదికను వారు స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
News March 13, 2026
గద్వాల: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి – డీఈవో

పదో తరగతి విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి కె. విజయలక్ష్మి సూచించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆమె విద్యార్థులకు ధైర్యం చెప్పారు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు.
News March 13, 2026
రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలి: VZM SP

జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని తెలిపారు.


