News November 6, 2025

NZB: మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

image

నవీపేట్(M) ఫతేనగర్ శివారులో అక్టోబర్ 24న జరిగిన <<18089668>>మహిళ హత్య<<>> కేసులో ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు NZB ACP రాజావెంకట్ రెడ్డి తెలిపారు. ఫకీరాబాద్, కోస్గీ, మద్దేపల్లికి చెందిన సంగీత, మంగలి బాబు, పద్మ.. మృతురాలు శ్యామల లక్ష్మీ @ బుజ్జిని ఫతేనగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశారు. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. డబ్బుల కోసం వారి మధ్య గొడవ జరిగిందని ACP వెల్లడించారు.

Similar News

News March 18, 2026

నల్గొండ: అధిక వడ్డీ కేసు.. నిందితులకు రిమాండ్

image

అధిక వడ్డీ పేరుతో రూ.40 కోట్లు వసూలు చేసిన కేసులో నాగార్జునసాగర్ పోలీసులు వాడిత్య భీమా, రమేశ్, శేఖర్, సురేశ్‌ను అరెస్ట్ చేశారు. నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలతో మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మొబైళ్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

News March 18, 2026

హైదరాబాద్‌లో హోటళ్లు బంద్!

image

నగరంలో LPG సిలిండర్ల కొరతతో వ్యాపారాలు మూసేసే పరిస్థితి నెలకొంది. దాదాపు 2 వేల వరకు చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూసివేసినట్లు తెలుస్తోంది. కొన్ని హోటళ్ల నిర్వాహకులు రూ.10 నుంచి రూ.30 వరకు ఎక్స్‌ట్రా(గ్యాస్ ఛార్జ్) అని బోర్డులు పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. LPG సిలిండర్లు అందుబాటులో లేకపోతే హోటళ్లు నడపడం కష్టమే అని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.