News April 11, 2024

MBNR, NGKL: 5ఏళ్లు.. 3,27,451 మంది ఓటర్లు

image

ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ ఐదేళ్లలో(10.67 శాతం) 3,27,451 మంది ఓటర్లు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి MBNR లోక్‌సభ పరిధిలో 16,80,417, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 17,37,773కు ఓటర్ల సంఖ్యం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 68వేల ఓట్లు నమోదుయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో 18-39 ఏళ్ల మధ్య ఓటర్లు 52 శాతం ఉన్నారు. ఈ ఐదేళ్లలో 701 కేంద్రాలు పెరిగాయి.

Similar News

News December 23, 2024

BRS ప్రతిపక్షంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయారు: ఎంపీ

image

బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి ఒక్క ఏడాది అయిందనే విషయాన్ని కేటీఆర్, హరీష్ రావులు మర్చిపోయారు. ఇంకా తామే అధికారంలో ఉన్న ఊహల్లో మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. గతంలో వారు లక్ష రుణమాఫీ అని నాలుగు, ఐదు కంతుల్లో వేస్తే అవి వడ్డీలకే సరిపోయాయని విమర్శించారు.

News December 22, 2024

NGKL: శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

NGKL జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<14947368>>స్పాట్‌డెడ్<<>> అయ్యారు. స్థానికుల సమాచారం.. గండీడ్ మండల వాసి ఈశ్వర్, సంగారెడ్డికి చెందిన అరవింద్(20) బైక్‌పై శ్రీశైలం వెళ్తున్నారు. మన్ననూరు లింగమయ్య ఆలయం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. అరవింద్ స్పాట్‌లోనే చనిపోయాడు. ఈశ్వర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.

News December 21, 2024

కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు: సీఎం రేవంత్

image

బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వెనుకబడిన t
కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగచర్లలో దాడులు చేయించారన్నారు. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై ఉసిగొల్పారని మండిపడ్డారు. అధికారులు ఏం పాపం చేశారని వారిపై దాడులు చేశారని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు.