News November 6, 2025

చర్ల: ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

image

తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లా పరిధిలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. తాళ్లగూడెం ఠాణా పరిధిలోని అన్నారం, మరిమల్ల గ్రామాల సమీప అడవుల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు ముగిసిన అనంతరం ఘటనా స్థలానికి వెళ్లిన భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాలను సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 13, 2026

ధర్మవరం: 14 ఏళ్ల తర్వాత ఇంటికి..!

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన పరమేశ్, లక్ష్మీదేవమ్మ కుమారుడు నాగార్జున చదువుకోవడం ఇష్టం లేక 10thలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బెంగళూరులో కొత్త కాలం ఉన్నాడు. శాంతిపురానికి చెందిన బాబా అతడిని తెచ్చి పెంచుకున్నాడు. బాబా తమ రేషన్ కార్డులో అతని పేరు చేర్చడంతో కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్నట్లు తెలిసింది. TDP నేతల సహకారంతో నాగార్జునను 14 ఏళ్ల తర్వాత తమ ఇంటికి తీసుకెళ్లారు.

News March 13, 2026

‘క్రీమీ లేయర్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

OBC రిజర్వేషన్ల కోసం క్రీమీ లేయర్ హోదాను తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి మాత్రమే నిర్ణయించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయా సంస్థల్లో వారి పదవులు, హోదానూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సివిల్స్ పరీక్షను క్లియర్ చేసినా క్రీమీ లేయర్‌లో పొరపాటున చేర్చడంతో నష్టపోయిన అభ్యర్థులకు ఊరట కల్పించింది. వారి అపాయింట్‌మెంట్స్‌ను నిరాకరిస్తూ కేంద్రం వేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.

News March 13, 2026

క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అంటే?

image

OBC కేటగిరీని క్రీమీ/నాన్ క్రీమీ లేయర్ అని 2 రకాలుగా విభజిస్తారు. ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెంది, వార్షికాదాయం ₹8Lకు పైగా(జీతం, వ్యవసాయ ఆదాయం మినహాయించి) ఉంటే క్రీమీ లేయర్‌గా పరిగణిస్తారు. వారికి రిజర్వేషన్లు వర్తించవు. ఆదాయ పరిమితి ఏడాదికి ₹8L కంటే తక్కువగా ఉన్న వారిని నాన్ క్రీమీలేయర్‌గా పరిగణించి ఉన్నత విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పిస్తారు.