News November 6, 2025
VKB: సీఎం వెళ్లే రహదారే ఇలా ఉంటే.. ఎలా?

మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. కాగా, VKB జిల్లాలోని రహదారులు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలు రాజకీయ నాయకులపై తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌కు తరుచూ HYD – బీజాపూర్ రహదారిలో వెళ్తారని సీఎం వెళ్లే రహదారికే ఈ దుస్థితి ఉంటే.. స్థానిక ప్రజలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
Similar News
News November 6, 2025
DANGER: CT స్కాన్ చేయిస్తున్నారా?

ఏదైనా చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే సీటీ స్కాన్, MRIలను వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. అయితే CT స్కాన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే మొత్తం క్యాన్సర్ సంఖ్యల్లో CT స్కాన్ క్యాన్సర్లు 5 శాతానికి చేరొచ్చని అమెరికాలో జరిగిన అధ్యయనంలో తెలిసినట్లు పేర్కొన్నారు. CT స్కాన్‌ల వినియోగం, డోసులు తగ్గించకపోతే ప్రమాదమేనంటున్నారు.
News November 6, 2025
HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News November 6, 2025
వనపర్తి: ప్రతి నెల గ్రామసభలు నిర్వహించాలి

గ్రామస్థాయి అధికారులు ప్రతినెల గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి తరుణ్ సూచించారు. గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామ సభల ద్వారా దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని ఆయన సూచించారు.


