News November 6, 2025

NLG: సిక్స్ లేన్లుగా హైవే విస్తరణకు నోటిఫికేషన్!

image

HYD–VJD మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం ఉన్న 4 లేన్ల నుంచి 6 లేన్లుగా (231.32KM దూరం) విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్మాణాలు చేయనున్నారు. రూ.10,391 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే HYD నుంచి VJDకు ప్రయాణం 2 గంటలు తగ్గనుంది. 6 వరుసలుగా మారితే ప్రమాదాలతో పాటు ప్రయాణ కష్టాలు తొలగనున్నాయి.

Similar News

News March 28, 2026

NTR: పవన్ కల్యాణ్‌కు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు

image

అసెంబ్లీ వేదికగా డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌కు CM చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏకైక రాజధానిగా అమరావతి చట్టబద్ధతను పునరుద్ధరించే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా పవన్ అందించిన మద్దతును కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని అన్నారు. ఎన్నికలకు ముందు తాను జైల్లో ఉన్నప్పుడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలన్నీ కలిసి పోటీచేయాలని పవన్ తీసుకున్న చొరవను ప్రశంసించారు.

News March 28, 2026

NGKL: జాతీయ లోక్ అదాలత్‌లో 5,625 కేసుల పరిష్కారం

image

జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 8 బెంచీలలో మొత్తం 5,625 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత తెలిపారు. రాజీ పడితే కక్షిదారులు ఇద్దరూ విజేతలేనని, సమయం, డబ్బు ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలు, డ్రంకెన్ డ్రైవ్ వంటి సివిల్, క్రిమినల్ కేసులను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు వెల్లడించారు.

News March 28, 2026

పూతలపట్టు: చెరువులో పడి వ్యక్తి మృతి

image

పూతలపట్టు మండలం ఎగువ పాలకురు గ్రామానికి చెందిన రామకృష్ణయ్య చెరువులో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. దిగువ పాలకురు చెరువులో ఆవులు మేపడానికి వెళ్లి ఆవుల్ని అదుపు చేసే క్రమంలో చెరువులో దిగి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి ఆవులు మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.