News November 6, 2025

కుమ్మెరలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం

image

గడచిన 24 గంటలలో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెరలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పాలెంలో 33.5, లింగాలలో 22.5, కల్వకుర్తిలో 15.5, బిజినేపల్లిలో 15.0, కొండనాగులలో 13.8, పెద్దముద్దునూరులో 10.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

Similar News

News March 12, 2026

శ్రీకాకుళం: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్

image

శ్రీకాకుళం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం స్క్వాడ్ పరిశీలనలో కాపీయింగ్ చేస్తున్న ఆరుగురిని డిబార్ చేసినట్లు డీఈవో ఎ.రవి బాబు చెప్పారు. 866 మంది విద్యార్థులకు 755 మంది హాజరు కాగా 111 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణను సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తున్నాయననారు.

News March 12, 2026

ఉగాది రోజు ఇలా చేయకండి: పండితులు

image

ఉగాది రోజున తప్పక పాటించాల్సిన నియమాలను పండితులు సూచిస్తున్నారు. ‘ఈ పర్వదినాన మాంసం ముట్టకూడదు. శాకాహారమే భుజించాలి. ఎవరిపై కోప్పడొద్దు. కన్నీరు పెట్టుకోకూడదు. ఈరోజుతో ఏడాది మొదలు కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. లేకుంటే దరిద్రం. అలాగే ఆరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తాగకుండా అస్సలు ఉండొద్దు’ అని చెబుతున్నారు.

News March 12, 2026

HYD: జనాభా గణనపై BIG UPDATE

image

జనాభా గణన- 2027ను గ్రేటర్ వ్యాప్తంగా పకడ్బందీగా చేపట్టి, డూప్లికేషన్ లేకుండా చూడాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. GHMC హెడ్ ఆఫీస్‌లో సెన్సెస్ సర్వేపై ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లు, అదనపు ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లకు 3 రోజుల శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. సర్వే 2 దశల్లో జరుగుతుందని మొదటి దశలో గృహ గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందన్నారు.