News November 6, 2025

యుగయుగాలకు ఆదర్శం ‘శ్రీరాముడి పాలన’

image

సత్య యుగంలో అంతా మంచే ఉన్నా, త్రేతా యుగంలోని రామ రాజ్యమే చరిత్రలో నిలిచింది. దీనికి కారణం శ్రీరాముని గొప్ప గుణాలు, ఆదర్శవంతమైన పాలన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చూపిన రాజధర్మం సుపరిపాలనకు చిరునామాగా నిలిచింది. ఒక గొప్ప వ్యక్తి రాజుగా ఉంటే, రాజ్యం ఎంతటి ఉన్నత శిఖరాలను చేరుతుందో రామరాజ్యం రుజువు చేసింది. అందుకే, యుగాల తరబడి ఆ పాలనను ఆదర్శంగా చెప్పుకుంటారు. ‘రామరాజ్యం’ అని పోల్చుతుంటారు.

Similar News

News March 24, 2026

ముంబైకి సూర్యను కెప్టెన్ చేయాలి: అశ్విన్

image

MI కెప్టెన్సీని సూర్యకు అప్పగించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల <<19453220>>మాజీ క్రికెటర్ శ్రీకాంత్<<>>, తాజాగా అశ్విన్ ఇవే కామెంట్స్ చేశారు. ‘హార్దిక్ మంచి నాయకుడే. కానీ MIకి వచ్చాక తొలి ఏడాది రోహిత్ వ్యవహారంతో గడిచిపోయింది. ప్రస్తుతం భారత T20 జట్టు కెప్టెన్ సూర్య IPLలో హార్దిక్ నాయకత్వంలో ఆడాలి. ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
* MI కెప్టెన్‌గా ఎవరు బెటర్? కామెంట్ చేయండి.

News March 24, 2026

తగ్గేదే లే.. యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు

image

పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌పై దాడులకు US అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ ఇచ్చినా తాము మాత్రం ఆగేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగుతాయన్నారు. కాగా దాడుల్లో సాధించిన విజయాలే డీల్‌లో పైచేయి సాధించడానికి కీలకం అవుతాయని భావిస్తున్నట్లు ట్రంప్ తనతో చెప్పారని తెలిపారు.

News March 24, 2026

అభివృద్ధిని ఓర్వలేకే నిప్పు పెట్టారా అనే అనుమానాలు: హోంమంత్రి

image

AP: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ప్రమాదవశాత్తు <<19460870>>అగ్నిప్రమాదం<<>> జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. అభివృద్ధిని ఓర్వలేకే నిప్పు పెట్టారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. గతంలో అరటి తోటకు నిప్పు పెట్టారని గుర్తు చేశారు. అమరావతిపై కుట్రలు పన్నితే సహించేది లేదన్నారు.