News November 6, 2025
గుంతలో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో <<18207678>>నిన్నటి<<>> బస్సు ప్రమాదం మరవకముందే, నేడు మరో ఘటన జరిగింది. మండల పరిధిలోని తక్కల్లపల్లి గ్రామంలో విద్యార్థుల ఆర్టీసీ బస్సును డ్రైవర్ రివర్స్ చేస్తుండగా గుంతలోకి దిగింది. విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. బస్సు గుంతలో ఇరుక్కుపోవడంతో స్థానికులు ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగారు. డ్రైవర్లు అప్రమత్తంగా బస్సులు నడపాలని, నిర్లక్ష్యం విడనాడాలని స్థానికులు వాపోతున్నారు.
Similar News
News March 13, 2026
బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు మహాశక్తి ఆలయం వద్ద ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో బీజేపీకి చెందిన 108 మంది సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, మేయర్, కౌన్సిలర్లు సహా ప్రజాప్రతినిధులు, వేలాదిగా కార్యకర్తలు పాల్గొననున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో సాగాలని సంజయ్ శ్రేణులకు సూచించారు.
News March 13, 2026
కరీంనగర్ పీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్

కరీంనగర్‌లోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రం (PTC)లో 2025–2026 బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ వైభవంగా జరిగింది. ఈ శిక్షణలో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి TGSP కానిస్టేబుల్ గోగికర్ రోహన్ ‘ఆల్ రౌండర్’ అవార్డును కైవసం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్యఅతిథిగా హాజరై రోహన్‌కు ట్రోఫీని అందజేసి, ప్రత్యేకంగా అభినందించారు.
News March 13, 2026
గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి

గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. అపోహలను సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో సమీక్ష నిర్వహించారు. ములుగు కలెక్టర్ దివాకర టి.ఎస్ పాల్గొన్నారు.


