News November 6, 2025

కృష్ణా జిల్లాలోకి రానున్న కైకలూరు నియోజకవర్గం

image

ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గం త్వరలోనే కృష్ణా జిల్లాలోకి రానుంది. జిల్లాల మార్పుకై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెల్లడించిన వివరాల మేరకు.. ఈ మార్పుకై గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఏలూరు డివిజన్‌లో ఉన్న కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, మండలాలు గుడివాడ రెవిన్యూ డివిజన్ కిందకు రానున్నాయి.

Similar News

News March 27, 2026

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించండి: MP బాలశౌరి

image

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కోవిడ్ సమయంలో మచిలీపట్నం-తిరుపతి రైలును నిలిపివేశారని, అప్పటి నుంచి మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిలిచిపోయిన రైలును పునరుద్ధరించాలన్నారు.

కృష్ణా: డీపీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు

image

కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయంపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఓ కీలక అధికారి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఈ అధికారి పంచాయతీ కార్యదర్శులను టార్గెట్ చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇవ్వని వాళ్లను ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 14ఏళ్లుగా ఆయన ఇక్కడే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం.